బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2020 (17:20 IST)

వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చు..

అద్దె గర్భంపై దీనిపై కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు తమ ఇష్టపూర్వకంతో తమ గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన అద్దె గర్భం నియంత్రణ బిల్లు–2020పై బుధవారం (ఫిబ్రవరి 26,2020) కేంద్ర కేబినెట్‌ సమావేశం ఆమోద ముద్ర వేసింది. వితంతువులు, విడాకులు పొందిన వారూ కూడా  తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది.
 
సరోగసీపై గతంలోని ముసాయిదా బిల్లులన్నింటినీ అధ్యయనం చేసి రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ ఇచ్చిన సూచనలు అన్నింటినీ ఈ బిల్లులో పొందుపరిచినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాతో చెప్పారు. 
 
సరోగసీని వ్యాపారంగా కాకుండా.. మంచి ఉద్దేశమైతే సరొగసీకి సహకరించడం ఈ కొత్త బిల్లు లక్ష్యాలని మంత్రి చెప్పారు. ఈ కొత్త బిల్లు ప్రకారం.. భారత్‌కు చెందిన దంపతులు మాత్రమే ఈ బిల్లులోని అంశాలను పరిగణలోకి తీసుకుని సరోగసి చేపట్టేందుకు వీలుంటుందని మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు.