గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (10:34 IST)

ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ మంత్రివర్గం తీర్మానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి రద్దు అయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ తీర్మానం చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఈ భేటీలో మండలి రద్దు చేస్తే పరిస్థితేంటి..? మండలిలోని పార్టీ నేతలకు ఎలా న్యాయం చేయాలి..? ఇలా అన్ని విషయాలపై నిశితంగా చర్చించిన తర్వాత కేబినెట్ నిర్ణయించింది
 
ఇదిలావుంటే, సీఆర్‌డీఏ రద్దు, రాష్ట్రంలో అధికార, పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలతో అధికారపక్షం విస్తుబోయింది. శాసనసభలో 175 స్థానాలలో 151 స్థానాలతో .. 80 శాతంపైగా సభ్యులను కలిగి బిల్లులను ఆమోదిస్తే.. శాసనమండలిలో తిరస్కరణకు గురికావడం ముఖ్యమంత్రికి మింగుడుపడలేదు. ఫలితంగా శాసనమండలిని జగన్‌ రద్దు చేస్తున్నారని టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.