భూమ్మీద నూకలున్నాయ్, తృటిలో తప్పించుకున్నాడు (video)
కొన్ని ప్రమాదాలు రెప్పపాటులో జరుగుతాయి. ఇలాంటి ప్రమాదాల్లో సైతం కొంతమంది అదృష్టవశాత్తూ ఎంతమాత్రం దెబ్బలు తగలకుండా బైటపడతారు. అలాంటి ఘటన తాలూకు ఓ వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.
సదరు వీడియో ఓ వృద్ధుడు వర్షానికి బాగా నానిపోయిన గోడకు దగ్గరగా వెళ్లాడు. అలా గోడ వున్న ప్రాంతాన్ని దాటి కాస్త అవతలకు రెండుమూడు అడుగులు వేయగానే దాదాపు 8 అడుగులు ఎత్తు వున్న ఆ గోడ కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తూ అతడు పక్కకి వుండటం వల్ల ఆ గోడ అతడిపై పడలేదు. సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
जाके रखो सइयां, मार सके न कोई। pic.twitter.com/CKuAOa3ieB
— DHARMA (@Dharma0292) September 21, 2025
