సంబంధిత వార్తలు
- 'రీస్టార్ట్ పాలసీ'లో రాయితీల కోసం దరఖాస్తు చేసుకోండి: కృష్ణా కలెక్టర్
- ఏడాదంతా జాగ్రత్త... సీజన్‌తో సంబంధం లేకుండా కరోనా సోకే అవకాశం
- రైల్ రిజిర్వేషన్ లో మనం కోరుకున్న సీటు దొరకదు ఎందుకు?
- విద్యార్థికి కామపాఠాలు బోధించి లేపుకెళ్ళిన టీచర్, ఎక్కడ..?
- ఇకపై ఆలయాల్లో మహిళా పూజారులు.. సీఎం స్టాలిన్ అనుమతితో..?
రైలు టికెట్లపై రాయితీ పొడిగింపు
టికెట్లు బుక్ చేసుకొనేందుకు యూపీఐ ద్వారా పేమెంట్లు చేసే ప్రయాణికులకు భారత రైల్వే ఇప్పటికే రాయితీని కల్పిస్తోంది. తాజాగా ఈ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2017 డిసెంబరు నుంచి టికెట్ల బుకింగ్‌కు యూపీఐ పేమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకొనే వారితో పాటు రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో కూడా యూపీఐ చెల్లింపులు చేసుకొనే సౌకర్యం అందుబాటులో ఉంది.
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ ( బీహెచ్‌ఐఎం) ద్వారా చెల్లింపులు చేసుకొనే అవకాశం ఉంది.
ఈ విధంగా చెల్లింపులు చేసుకున్న వారికి టికెట్ రుసుముపై 5 శాతం రాయితీని అందిస్తున్నారు. తాజాగా ఈ పథకాన్ని 2022 జూన్ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తర్వాతి కథనం
