గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (08:57 IST)

ఏపీ, తెలంగాణ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేత

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది.

కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా ప్రభావం ఎక్కువున్న సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళు RT-PCR నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. రిపోర్ట్ లేకుంటే 14 రోజుల క్వారంటైన్ ఉండాలని పేర్కొంది.

ఢిల్లీలో బండి సంజయ్‌ని కలిసిన పటేల్‌
భైంసాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీజేపీ నాయకుడు మోహన్‌రావు పటేల్‌ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను ఢిల్లీలో కలిశారు.

ఢిల్లీలో మాజీ మంత్రి ఈటెల రాజేంధర్‌, మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ తదితరులు బీజేపీలో చేరిన సందర్భంగా మోహన్‌రావు పటేల్‌ కూడా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్‌ను కలిసి భైంసా పరిస్థితులను వివరించారు.