1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Drank sanitizer instead of polio drops

పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ తాగించారు.. ఎక్కడో తెలుసా?

sanitizer
మహారాష్ట్రలోని యవత్మాల్‌లో ఆరోగ్య కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిచారు. 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు శానిటైజర్ తాగించారు. దీంతో వారు అనారోగ్యం పాలవడంతో ఆసుపత్రికి తరలించారు.

ఈ ఉదంతం ఘాటాంజీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యవత్మాల్ పరిధిలోని ఒక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు.

ఈ నేపధ్యంలో అక్కడి ఆరోగ్య కార్యకర్తలు 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించారు.

దీంతో వారు కొద్దిసేపటి తరువాత అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
తర్వాతి కథనం
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ నోటీసులు