సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (09:10 IST)

ఇకపై షాంపూ ప్యాకెట్ల తరహాలో రూపాయికే శానిటైజర్​!

కరోనా కాలంలో శానిటైజర్​ వాడకం తప్పనిసరి అయింది. అయితే... ఒకేసారి పెద్ద డబ్బా కొనాలంటే ఖర్చు ఎక్కువ. ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడమూ కష్టమే. అందుకే షాంపూ ప్యాకెట్ల తరహాలో శానిటైజర్​ తెచ్చేందుకు సిద్ధమైంది కేవిన్​కేర్.

కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు తరచూ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలో శానిటైజర్ల వాడకం ఎక్కువైంది. ధరలు కూడా పెరిగాయి.

అయితే... శానిటైజర్లను మరింత మందికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రముఖ సంస్థ కేవిన్​కేర్. చిక్, నైల్, రాగా వంటి ప్రముఖ షాంపూలు తయారీ సంస్థ కేవిన్​కేర్​ రూపాయి ప్యాకెట్ల తరహాలో శానిటైజర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ సంస్థ 5 లీటర్ల శానిటైజర్​ ప్యాక్​ను విడుదల చేసింది.