బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (17:59 IST)

రాబోయే రెండు వారాలే కీలకం.. వెయ్యికి పైగా దాటిన కరోనా కేసులు

రాబోయే రెండు వారాలు జాతి భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. దేశంలో కరోనా ఎంత వేగంగా వ్యాప్తి చెందిందనేది ఈ వారంలో తేలిపోనుంది. అంటే చైనాలో మాదిరిగా ఇక్కడ కూడా విస్తరించినట్లయితే వారంలో కరోనా కేసుల సంఖ్య 9,140కి చేరుకుంటుందని, ఒకవేళ అతి తక్కువగా.. అంటే జపాన్‌లో మాదిరిగా ఉంటే 1,524 కి చేరుతుందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి సరిగ్గా రెండు నెలల సమయం అవుతుంది.
 
దేశంలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు ఫిబ్రవరి 1న నమోదైంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1000 దాటింది. ఇకపోతే..  గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 227 కోరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 1,237 మంది కరోనా బారిన పడ్డారని తెలిపింది. 
 
వైద్యులను వేధించడం కుదరదని.. ఇప్పటికే 15వేల మంది నర్సులకు ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 42,788 నమూనాలను పరీక్షించామని... మొత్తం 123 ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. 49 ప్రైవేట్‌ ల్యాబ్‌లకు అనుమతినిచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.