బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (16:05 IST)

లాక్ డౌన్.. ఏప్రిల్ తొలివారం నుంచి శక్తిమాన్ సీరియల్ మళ్లీ ప్రసారం..

sakthimaan
లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే సీరియల్స్‌ను ఆపేశారు. షూటింగ్‌లు జరగకపోవడంతో సీరియల్స్ ప్రసారం ఆపేయాల్సిన పరిస్థితి. రామాయణం, మహాభారతం సీరియల్స్‌ను దూరదర్శన్‌, డీడీ భారతిలో ప్రసారం చేస్తోంది. 
 
ఇక తాజాగా.. శక్తిమాన్, చాణక్య సీరియల్స్‌ను కూడా ఏప్రిల్‌ తొలివారం నుంచి ప్రసారం చేయనున్నట్టు దూరదర్శన్‌ తెలిపింది. అంతేకాదు.. వీటితో పాటుగా శ్రీమాన్‌ శ్రీమతి, ఉపనిషద్‌ గంగా, కృష్ణ కాళి సీరియల్స్‌ కూడా ప్రసారం అవుతాయని సమాచార శాఖ పేర్కొంది.
 
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే రోజు ఇంటిలో కాలక్షేపానికి టీవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో రెగ్యూలర్ సీరియల్స్‌కు బదులుగా ఓల్ట్ సీరియల్స్ కోసం నెట్టింట్లో వెతకడం ప్రారంభించారు. ఇంకో పాత సీరియల్స్‌ని మళ్లీ ప్రసారం చేయాల్సిందిగా ట్వీట్ చేస్తున్నారు.