బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (11:48 IST)

కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడంలో తిరుపతి టాప్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తిరుపతి అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలోని స్మార్ట్‌సిటీలైన విశాఖపట్టణం, అమరావతి, కాకినాడతో పోలిస్తే తిరుపతి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో మొదటి స్థానంలో నిలిచింది. 
 
వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ఇక్కడ భేషుగ్గా ఉన్నాయని స్మార్ట్‌మిషన్ తన నివేదికలో పేర్కొంది.వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో స్మార్ట్‌నగరాల పనితీరును స్మార్ట్‌సిటీ మిషన్ మూడు గ్రేడ్‌లుగా విభజించి పరిశీలించింది.
 
విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్ల వద్ద పక్కాగా మార్కింగ్ చేయడం, వారిని క్వారంటైన్ చేయడంలో తిరుపతి అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్ల వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులు అందిస్తున్నారని స్మార్ట్‌మిషన్ తెలిపింది.
 
అలాగే లాక్ డౌన్ కొనసాగినంత కాలం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనాలకు భక్తులను అనుమతించే అవకాశం లేదని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఏప్రిల్ 14 వరకూ దర్శనాలను నిలిపివేశామని, ఆ తరువాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు. స్వామివారి సేవలన్నీ ఏకాంతంగానే జరుగుతున్నాయని, శ్రీరామనవమి, పట్టాభిషేకం కూడా ఏకాంతంగానే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.