1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Election officials clarify actor prakash raj vote missing

ప్రకాష్ రాజ్ ఓటును తొలగించలేదు.. షిఫ్టెడ్ జాబితాలో ఉంది : ఈసీ

prakashraj
తన ఓటును తొలగించినట్టు నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం అధికారులు కొట్టిపారేశారు. ఆయన ఓటును తొలగించలేదని షిఫ్టెడ్ జాబితాలో ఉందని తెలిపారు. ఆయన ఓటును శాశ్వతంగా చిరునామా మారిన జాబితాలో చేర్చినట్టు ఈసీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. 
 
మరోవైపు ఆయన ఓటును తొలగించలేదని బెంగళూరు సెంట్రల్‌ సిటీ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది. ఓటర్‌ ఐడీలో పేర్కొన్న చిరునామాలో ప్రస్తుతం ఆయన ఉండడం లేదని వెల్లడించింది. నిబంధనల ప్రకారం శాంతినగర్ నియోజకవర్గంలో ఆయన నమోదు చేసుకున్న అడ్రస్‌లో విచారణ చేయగా.. గత నాలుగు సంవత్సరాలుగా ప్రకాశ్ రాజ్ ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించడం లేదని అక్కడి వారు ధ్రువీకరించారు. దీంతో ఆయన ఓటును 'షిఫ్టెడ్' (చిరునామా మారినవారు) జాబితాలో చేర్చినట్లు బెంగళూరు సెంట్రల్‌ సిటీ కార్పొరేషన్‌ తెలిపింది.
 
ఈ విషయమై అదనపు జిల్లా ఎన్నికల అధికారి జగదీష్ మాట్లాడుతూ, ప్రకాశ్ రాజ్‌తో ఫోన్‌లో మాట్లాడగా ఆయన కూడా సదరు అపార్ట్‌మెంట్‌లో ఉండటం లేదని చెప్పారని, శాంతినగర్ నియోజకవర్గంలోనే వేరే ప్రాంతంలో నివసిస్తున్నారని తెలిపారని అన్నారు. ఆయన తన ప్రస్తుత నివాస చిరునామాతో ఫారమ్-6తో ఓటరు జాబితాలో పేరును పునరుద్ధరించుకోవచ్చని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)పై ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణలు వాస్తవం కాదన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నల్లమల అడవుల్లో చనిపోతున్న టైగర్స్.. పులి గోళ్లతో స్మగ్లింగ్.. ఏడుగురు అరెస్ట్.. ఏం జరుగుతోంది..?