ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (12:14 IST)

ఢిల్లీలో ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నైరుతి ఢిల్లీలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో ఉన్న ఆయిల్ ట్యాంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. అయితే, ఆయిల్ ట్యాంకులో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 
 
దాదాపు రెండు మూడు గంటల పాటు అగ్నిమాపకదళ సిబ్బంది శాయశక్తులా కృషి చేసి మంటలను అదుపు చేశాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది.