బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (20:11 IST)

శ్రీనగర్ రాజ్‌బాగ్‌‍ వాణిజ్య భవనంలో మంటలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే రాజ్‌బాగ్‌లోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పివేశాయి. 
 
ఈ కాంప్లెక్స్‌లో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక అధికారులు అధికారికంగా అంచనా వేశారు. ఈ క్రమంలో మంటలను అదుపు చేస్తుండగా, ఫైర్ ఇంజిన్ అధికారి ఒకరు గాయపడ్డారు. అయితే, ప్రాణనష్టం సంభవించకపోయినప్పటికీ... ఆస్తి నష్టం మాత్రం వాటిల్లింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.