1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (14:19 IST)

బీహార్‌లో కల్తీ మద్యానికి ఆరుగురు మృతి

బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంపూర్ణ మద్య నిషేధంపై ప్రత్యేక దృష్టిసారించారు. మరోవైపు, రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. 
 
తాజాగా బీహార్‌లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మద్యంబాబులు ప్రాణాలు కోల్పోయారు. బక్సర్ జిల్లాలోని అమ్సారీలో బుధవారం రాత్రి పలువురు కల్తీ మద్యం సేవించారు. దీంతో వారిలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ జిల్లా నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో ఐదుగురు మరణించి వారం రోజుల తిరగకముందే బక్సర్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.