బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (11:48 IST)

నెల్లూరు ఏఎస్ పేటలో అగ్నిప్రమాదం... మహిళ సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా అనుమసముద్రం పేట (ఏఎస్ పేట)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక షపా బావి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. విద్యుదాఘాతం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
కాగా, మృతురాలు హైదరాబాద్ నగరానికి చెందిననట్టుగా భావిస్తున్నారు. స్థానిక దర్గా దర్శనం కోసం ఆమె వచ్చినట్టు తెలుస్తోంది. మృతురాలికి మతిస్థిమితం లేకపోవడంతో దర్గాకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మరో మహిళ కూడా గాయపడ్డారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.