1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Former soldiers on duty again

మళ్లీ విధుల్లోకి మాజీ సైనికులు

Former soldiers
దేశంలోని మాజీ సైనికులకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ శుభవార్త చెప్పింది. దేశంలోని వివిధ దళాలకు చెందిన మాజీ సైనికులు 1.2 లక్షలమందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది.

దేశంలో ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పడుతుండటంతో… ఆయా పరిశ్రమల్లో భద్రతా విధులు నిర్వర్తించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ ఎఫ్) అవసరమవుతోంది. కేంద్ర భద్రతాదళాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ జవాన్లకు సీఐఎస్ ఎఫ్ లో కాంట్రాక్టు పద్ధతిలో కొత్తగా నియమించాలని నిర్ణయించారు.

సీఐఎస్ ఎఫ్ దళానికి అదనంగా ఉద్యోగులు కావాలని ప్రతిపాదనలను ఆ సంస్థ ఐజీ కేంద్రహోంమంత్రిత్వశాఖకు పంపించారు.

మాజీ సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీఐఎస్ ఎఫ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మాజీసైనికులను సీఐఎస్ ఎఫ్ జవాన్లుగా నియమించేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
విదేశాలకు పారిపోయిన నిత్యానంద.. కిడ్నాప్, రేప్ కేసు నమోదు కాగానే జంప్?