సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2019 (12:53 IST)

రస్క్ తింటున్నారా? ఇకే రిస్కేనట..?! ఎలాగంటే?

బ్రిటానియా సంస్థకు చెందిన రస్క్‌లో ఇనుప బోల్ట్ వుండినట్లు కరూర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఇక రస్క్ తినేవాళ్లు కాస్త రిస్కెందుకని వద్దనుకుంటారని సోషల్ మీడియాలో పెద్దగా చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళితే.. కరూర్ బస్టాండ్‌లో అమ్మబడిన బ్రిటానియా రస్క్ ప్యాకెట్‌లో ఇనుప బోల్ట్ వుండటాన్ని గమనించిన కస్టమర్, ఆ విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేశాడు. 
 
ఈ ఫిర్యాదు మేరకు సదరు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బ్రిటానియా సంస్థ తయారీ చేసే ఆహార పదార్థమైన రస్క్‌లో ఐరన్ బోల్ట్ ఎలా కలిసింది? అనే ప్రశ్న తలెత్తింది. పిండి కలిపే యంత్రం నుంచి ఇనుప బోల్ట్ పడివుండవచ్చునని అధికారులు వివరణ ఇస్తున్నారు. మరి ఈ కేసు విచారణలో బ్రిటానియా సంస్థ కస్టమర్లకు ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.