సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (10:48 IST)

అయ్యప్ప యాత్రకు శునకం : స్వాముల వెంట 480 కి.మీ. నడక

ఆ శునకాకి భక్తి ఎక్కువైనట్టుంది. దీంతో అయ్యప్ప స్వాములు శబరిమల క్షేత్రానికి కాలినడకన బయలుదేరగా వారితో పాటు.. ఆ శునకం కూడా బయలుదేరింది. అలా ఏకంగా 480 కిలోమీటర్ల నడకసాగిచి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికిగురిచేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి 13 మందితో కూడిన అయ్యప్ప భక్తుల బృందం గత అక్టోబరు నెల 31వ తేదీన శబరిమల పుణ్యక్షేత్రానికి కాలినడకన బయలుదేరారు. వారు బయలుదేరిన ప్రాంతం నుంచే ఓ శునకం వారిని అనుసరించసాగింది. 
 
తొలుత వారు దాన్ని గమనించలేదు. ఆ తర్వాత దాన్ని గుర్తించిన అయ్యప్పలు.. అప్పటి నుంచి తమ భోజనంలో దానికి కూడా కొంత పెడుతూ వచ్చారు. శునకానికి ఒక కాలికి గాయం అయినప్పటికీ అది ఇప్పటివరకు అయ్యప్ప భక్తులతో కలిసి 480 కి.మీ.కుపైగా నడకసాగించింది. ఈ శునకానికి అయ్యప్పస్వామిపై ఉన్న భక్తిని చూసి ఏకంగా అయ్యప్ప స్వాములో విస్తుపోతున్నారు.