సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (20:20 IST)

పడక సుఖానికి నిరాకరించిందనీ కోడలిని హత్య చేసిన మామ

కర్నాటక రాష్ట్రంలోని మాండ్యలో దారుణం జరిగింది. పడక సుఖం ఇచ్చేందుకు నిరాకరించిన కోడలిని కామాంధుడైన మామ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. 
 
హాసన్ జిల్లా మండ్య తాలూకా రాగిముద్దనహళ్లి గ్రామానికి చెందిన వీణ (26) అనే మహిళకు రాగిముద్దనహళ్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి కుమారుడు అనిల్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. 
 
అయితే, నాగరాజు భార్య సావిత్రమ్మ రెండేళ్ళ క్రితం అనారోగ్యం కారణంగా చనిపోయింది. దీంతో నాగరాజుకు కోడలు వీణపై కన్నుపడింది. ఆమెను లొంగదీసుకుని శారీరక సుఖం పొందాలని పరితపిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఆమెను లైంగికంగా వేధించసాగాడు. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో ఈ విషయాన్ని భర్త అనిల్‌ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో తన తండ్రిని కుమారుడు హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ కోడలితో పడక సుఖం పంచుకోవాలన్న పట్టుదలతో ఆమెను వేధించసాగాడు. 
 
అయినప్పటికీ తండ్రి తీరు మారకపోవడంతో భార్య, పిల్లలతో కలసి అనిల్‌ గ్రామంలోనే వేరుగా ఉండసాగాడు. దీంతో వీణపై పగ పెంచుకున్న నాగరాజు కొడుకు లేని సమయంలో వీణను మరింత వేధించసాగాడు. ఈ వేధింపులు భరించలేని అనిల్... తన భార్యతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. ఫలితంగా జైలుకెళ్లిన నాగరాజు ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం ఇంటి బయటకు వచ్చిన వీణపై తమ్ముడు మంజు సహకారంతో కత్తితో దాడి చేసిన నాగరాజు గొంతు, కడుపులో పొడిచాడు. వీణ కేకలు విన్న అనిల్, గ్రామస్థులు వెంటనే అక్కడికి వెళ్లగా అప్పటికే వీణ రక్తపుమడుగులో పడి ప్రాణాలు విడిచింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.