సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (16:00 IST)

అయోధ్య తీర్పు : సోషల్ మీడియాలో హైఅలెర్ట్... రెచ్చగొడితే ఎన్.ఎస్.సీనే

అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలుజారీచేసింది. కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా అసత్య వార్తలను, రెచ్చగొట్టే ప్రకటనలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా, జాతీయ భద్రతా చట్టం కింద కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు. 
 
ఇగే అంశంపై కర్నాటక డీజీపీ నీలవేణి ఎన్. రాజు స్పందిస్తూ, మరో పది రోజుల్లో దేశంలోనే కీలక అంశమైన అయోధ్య తీర్పు వెలువడనున్న తరుణంలో సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. 
 
రాష్ట్రమంతటా గురువారం నుంచే సోషల్‌ మీడియాపై నిఘా ప్రారంభమైందని తెలిపారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌తో పాటు అన్ని సోషల్‌ మీడియా ఖాతాలపైనా రాష్ట్ర పోలీసులచే నిఘా కొనసాగిస్తామన్నారు. 
 
కేంద్ర ఇంటలిజెన్స్‌ సూచనలకు అనుగుణంగా సోషల్‌ మీడియాపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతా చర్యలు కొనసాగిస్తామన్నారు. ప్రజలు శాం తిని కాపాడే దిశగా వ్యవహరించాలని పోలీసులతో సహకరరించాలన్నారు. 
 
వదంతులను నమ్మరాదని బంధువులు మిత్రులతో ఏర్పా టు చేసుకున్న వాట్సప్‌ గ్రూపులలో దుష్ప్రచారాలకు అవకాశాలు ఇవ్వరాదన్నారు. అనవసరమైన పోస్టింగ్‌లు, వీడియోలు అప్‌లోడ్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.