సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (18:17 IST)

తాగిన మైకంలో కన్నతల్లి, సోదరి, తమ్ముడి భార్యపై అత్యాచారం.. వాళ్లే చంపేశారు..

మద్యం మత్తులో ముగ్గురిపై కామాంధుడు విరుచుకుపడ్డాడు. రాక్షసుడిలా ప్రవర్తించాడు. వావివరుసలు మరిచిపోయి.. కన్నతల్లి, తోడబుట్టిన చెల్లి, తమ్ముడి భార్య.. ఇలా ఇంట్లోని కుటుంబ సభ్యులందరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి ఆగడాలు పెచ్చరిల్లిపోవడంతో కుటుంబ సభ్యులే అతడిని హతమార్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దతియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. గోపాల్‌దాస్ కొండ ప్రాంతంలో ఈ నెల 12న ఓ యువకుడి మృతదేహం దొరికింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరపడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మృతదేహం 24 ఏళ్ల సుశీల్ జాదవ్‌‌దని గుర్తించారు. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో అతడు చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
 
కుటంబ సభ్యులపై పోలీసులకు అనుమానం రావడంతో తమదైన స్టైల్లో విచారించారు. విచారణలో కుటుంబ సభ్యులే అతడిని గొంతు నులిమి చంపేశారని వెల్లడయింది. ఎందుకలా చేశారని పోలీసులు ప్రశ్నిస్తే.. సుశీల్ జాదవ్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిసింది. 
 
మద్యం మత్తులో కన్నతల్లి, తోడపుట్టిన చెల్లితో పాటు తమ్ముడి భార్యనూ పలుమార్లు అత్యాచారం చేశాడు. నవంబర్ 11 తాగిన మైకంలో మరదలిపై అత్యాచార యత్నం చేశాడని.. జాదవ్ వేధింపులతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు అతడిని చంపేశారని తేలింది.