సంబంధిత వార్తలు
- ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ - హైదరాబాద్ - కేరళ యూనివర్శిటీల్లో ప్రదర్శన
- ఐకేర్: మీ నూతన సంవత్సర రిజొల్యూషన్ల జాబితాకు జోడించాల్సిన 5 హ్యాబిట్లు
- అనుకున్నది మాటల్లో కాదు.. ఆచరణలో పెట్టండి : ఆనంద్ మహీంద్రా
- గుజరాత్ కొత్త ఎమ్మెల్యేల్లో 40 మంది నేర చరితులే..
- ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోడీ - అమిత్ షా
గుజరాత్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం: BBCపై చర్యలు
బీబీసీ డాక్యుమెంటరీ కేవలం మోదీకి వ్యతిరేకంగానే కాదు.. దేశంలోనే రూ.135 కోట్ల మంది పౌరులకు వ్యతిరేకంగా వుందని గుజరాత్ సర్కారు తెలిపింది. 2002 గోద్రా అల్లర్ల డాక్యుమెంటరీతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రచేసిన బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ అసెంబ్లీ కేంద్రాన్ని అభ్యర్థిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
దీనిపై మంత్రి హర్ష్ సంఘవి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ జీవితమంతా దేశ సేవకు అంకితం చేశారని.. అభివృద్ధి సాధనాన్ని ఆయుధంగా మార్చి భారత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని చెప్పారు. దేశ వ్యతిరేక అంశాలకు తగిన సమాధానం ఇచ్చారని, ప్రపంచ వేదికపై భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలపడంలో మోదీ చాలా శ్రమించారని గుర్తు చేశారు.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై క్లీన్ చిట్‌ను పట్టించుకోకుండా అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా మోడీ నాయకత్వాన్ని సూచించినందుకు ఈ డాక్యుమెంటరీ వివాదానికి దారితీసింది.
