సంబంధిత వార్తలు
- రైతుల కోసం ప్రత్యేక యాప్
- దేశానికి సేవ చేద్దామనుకున్న ఆ 10 మంది యువకులను మృత్యువు కబళించింది
- దేశంలోనే భారీ సెక్స్ స్కాండల్ గుట్టు రట్టు.. అలాంటి వీడియోలతో బ్లాక్ మెయిల్.. వీఐపీలే..?
- భార్య కాపురానికి రాలేదని మెడ చుట్టూ బాంబులు కట్టుకున్న భర్త..
- తండ్రితో పాటు 30 మంది స్నేహితులు.. 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు..? లీవిస్తే చాలు..?
ఆరుబయట మలవిసర్జన చేశారని... చిన్నారులపై మూకదాడి!
మధ్యప్రదేశ్లో గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేసినందుకు ఇద్దరు చిన్నారులపై స్థానికులు మూకదాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేశారనే నెపంతో ఇద్దరు ఎస్సీ బాలలపై మూకదాడికి దిగారు గ్రామస్థులు. శివ్పుర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
శివ్పుర్ జిల్లా భావ్కేది గ్రామానికి చెందిన రోషనీ(12), అవినాశ్ (10) అనే ఇద్దరు చిన్నారులు.. ఇవాళ ఉదయం స్థానిక గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేశారు. అది గమనించిన గ్రామస్థులు వారిపై కన్నెర్ర చేశారు.
చిన్నపిల్లలని కూడా చూడకుండా కర్కశంగా మూక దాడి చేశారు. ఆ చిన్నారులను తీవ్రస్థాయిలో గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని.. బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు ఒడిగట్టిన నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తర్వాతి కథనం
