బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 25 సెప్టెంబరు 2019 (18:15 IST)

భార్య కాపురానికి రాలేదని మెడ చుట్టూ బాంబులు కట్టుకున్న భర్త..

భార్య కాపురానికి  రాలేదంటూ తమిళనాడులో ఓ వ్యక్తి ఏకంగా మెడలో బాంబులు వేసుకుని పేల్చుకుని చచ్చిపోతానంటూ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లో కలహాల నేపథ్యంలో నైవేలికి చెందిన మణికంఠ అనే వ్యక్తిపై అలిగిన అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వ్యవహారం విడాకుల దాకా వెళ్లి కోర్టులో కేసు నడుస్తోంది. భార్యకు ఎన్నిసార్లు సర్దిచెప్పినా తిరిగి కాపురానికి రాకపోవడంతో మణికంఠ డిఫరెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసాడు. 
 
నాటు బాంబులను దండలా మెడలో వేసుకుని అత్తవారింటికి వచ్చాడు. బాంబులతో వచ్చిన మణికంఠని చూసి స్థానికులతో పాటు అత్తమామలకు ముచ్చెమటలు పట్టాయి. పైగా కాసేపు తన బిడ్డను కూడా ఎత్తుకొని చచ్చిపోతాను అని బెదిరించడంతో మరింత హడలిపోయారు అక్కడివారు. 
 
ఈ సమాచారం తెలియడంతో అక్కడకు చేరుకున్న పోలీసులకు మణికంఠకు సర్ది చెప్పేందుకు తల ప్రాణం తోకకు వచ్చింది. చివరికి కాపురానికి పంపించేందుకు భార్యకు సర్ది చెబుతామని చెప్పి మణికంఠ ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమింపచేశారు పోలీసులు. అలా పోలీసులతో పాటు అక్కడే ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.