సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2019 (11:16 IST)

భార్యకు దూరమై.. ప్రియురాలితో సల్లాపాలు.. చితకబాదిన భార్య

అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ల యుగం కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు తరిగిపోతున్నాయి. తాజాగా ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్తను స్థానికులతో కలిసి చితక్కొట్టి పోలీసులకు అప్పగించింది ఓ భార్య. ఈ ఘటవ వరంగల్‌లోని శివనగర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. విభేదాల కారణంగా భార్యతో మూడేళ్లుగా దూరంగా ఉంటున్నాడు రవి అనే వ్యక్తి. అతనికి స్థానిక మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. దీంతో, తన జీవితాన్ని నాశనం చేసి.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు బుద్ధి చెప్పాలని భావించిన రవి భార్య.
 
ఈ క్రమంలో మంగళవారం ప్రియురాలితో అతడు సన్నిహితంగా ఉండడం చూసింది. స్థానికుల సహకారంతో వారిద్దరినీ పట్టుకుని చితకబాదింది. అనంతరం వారిద్దరినీ పోలీసులకు అప్పగించారు.