శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:29 IST)

రైతుల కోసం ప్రత్యేక యాప్

రైతుల కోసం 'సీహెచ్సీ- ఫార్మ్ మెషినరీ' పేరిట మొబైల్ యాప్ను ఆవిష్కరించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను యాప్ ద్వారా పొందవచ్చని మంత్రి తెలిపారు.

దేశంలోని అన్ని భాషల వారు యాప్ వినియోగించే విధంగా తయారు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ సామాన్ల కోసం రైతులు ఇబ్బంది పడకుండా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 'సీహెచ్సీ- ఫార్మ్ మెషినరీ' పేరిట మొబైల్ యాప్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

"దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఉపయోగించుకొనేల ఈ యాప్ను రూపొందించారు. రైతులు, సన్నకారు రైతుల్లో సాధికారత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. దీనిలో భాగంగానే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని మొబైల్ యాప్ను ఆవిష్కరించాము.

అందరూ ఉపయోగిస్తోన్న ఓలా, ఉబెర్ క్యాబ్ మాదిరిగానే వ్యవసాయ యంత్రాల కోసం యాప్ను రూపొందించాము. మొబైల్ యాప్లో 40 వేల సర్వీస్ సెంటర్ల వారు పేర్లను నమోదు చేసుకున్నారు. లక్ష ఇరవై వేల వ్యవసాయ యంత్రాలు, పరికారాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ యాప్ విప్లవాత్మకమైన సేవలను అందిస్తుంది. రైతులు మొబైల్ యాప్ ద్వారా దగ్గరలోని వ్యవసాయ పరికరాల కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. కావలసిన పరికరాల చిత్రాలు చూసుకొని ధరను బేరమాడి, ఆర్డర్ చేసుకోవచ్చు" అన్నారు.