శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2019 (19:57 IST)

దేశానికి సేవ చేద్దామనుకున్న ఆ 10 మంది యువకులను మృత్యువు కబళించింది

హరియాణా జింద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది యువకులు మరణించారు. హిస్సార్లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

హిస్సార్లో జరుగుతున్న నియామకాల్లో పాల్గొన్న యువకులు శారీరక, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సమాచారం. అనంతరం ఓ ఆటోలో తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ సమయంలో హాన్సీ రోడ్డు సమీపంలోకి రాగానే ఓ ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టగా డ్రైవర్ సహా 10 మంది అక్కడిక్కడే మరణించారు.

మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోయిన వారిలో ముగ్గురుని పోలీసులు గుర్తించారు. మిగతా వారి ఆనవాళ్ల కోసం సమీప గ్రామాలకు సమాచారం అందించారు.