బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (18:31 IST)

జైషే ఉగ్ర సంస్థ కమాండర్‌ను చంపేసిన భారత బలగాలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నిషేధిత ఉగ్రసంస్థ జైషే మొహ్మద్ సంస్థకు చెందిన టాప్ కమాండర్‌ను భారత బలగాలు చంపేశాయి. మృతుడిని షమ్ సోఫీగా గుర్తించాయి. ఈ విషయాన్ని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. అవంతిపొరా సెక్టార్‌లోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో షమ్ సోఫీని సంయుక్త బలగాలు హతమార్చాయని చెప్పారు.
 
కాగా, ఇటీవల ఐదుగురు పాక్ ప్రేరేపిత జైష్ ఉగ్రవాదులు సరిహద్దులను దాటి భారతదేశంలోకి అడుగుపెట్టారు. వీరు ఐదుగురు సాధారణ పౌరులను చంపేశారు. హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని మారణహోమానికి పాల్పడ్డారు. దీంతో, సైన్యం ఉగ్రమూకను ఏరివేసే కార్యక్రమం చేపట్టి విజయవంతమైంది. ఇటీవలి కాలంలో సైన్యం 10 మంది ఉగ్రవాదులను చంచడం గమనార్హం.