గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (14:36 IST)

జమ్మూకాశ్మీర్‌లో ఐదుగురు జవాన్ల వీరమరణం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మళ్లీ ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. తాజాగా ఉగ్రమూకల దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఈ దారుణం జరిగింది. 
 
ఇక్కడ ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న జవాన్లు ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో పాల్గొన్నారు. అపుడు ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు భార‌త జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందారు. 
 
మృతి చెందిన జ‌వాన్ల‌లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి కూడా ఉన్నారు. ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌ర‌ప‌డంతో భార‌త జ‌వాన్లు ధీటుగా స్పందిస్తున్నారు. ప్ర‌స్తుతం కాల్పులు కొన‌సాగుతున్నాయి. ఉగ్ర‌వాదుల‌ను జ‌వాన్లు మ‌ట్టుబెట్టే అవ‌కాశం ఉంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.