గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (11:11 IST)

మోంటానాలో పట్టాలు తప్పిన రైలు - ముగ్గురి మృతి

అమెరికా దేశంలోని మోంటానాలో పెను ప్రమాదం తప్పింది. మోంటానాలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.  
 
ఈ రైలు శనివారం సాయంత్రం 4 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సియాటెల్‌ నుంచి చికాగో బయలుదేరగా, జోప్లిన్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో రైలులో 147 మంది ప్రయాణికులు,13 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.