మణిపూర్‌లో పెట్రేగిన ఉగ్రవాదులు - ఐదుగురు మృత్యువాత
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఈ ముష్కర మూకలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఓ గ్రామ పెద్ద సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలోని కాంగ్‌పోక్సి జిల్లా బీ గమ్మోమ్ ప్రాంతంలో జరిగింది.
ఈ ప్రాంతంలో కుకీ మిలిటెంట్ల సంచారం అధికంగా వుంది. వీరు తాజాగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎంపీ ఖుల్లెన్ గ్రామ పెద్ద, మరో నలుగులు మరణించారు. మృతుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు.
ఇప్పటివరకు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మిలిటెంట్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని చెప్పారు. కాగా, గత ఆదివారం భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో నలుగురు కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదుల అంత్యక్రియలను గ్రామస్థులు నిర్వహిస్తుండగా మిలిటెంట్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని స్థానికులు వెల్లడించారు.