శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 జులై 2021 (11:42 IST)

వంటగదిలో కూర్చుని భోజనం చేస్తున్న మీరాబాయి చాను.. ఫోటో వైరల్

Meera Chanu
ఒలింపిక్ విజేత మీరాబాయి చాను వ్యక్తిగత జీవితంలో తాను ఎలాంటి కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకుందనే విషయాన్ని యాక్టర్ మాధవన్ ఒక ఫోటో ద్వారా అందరికీ తెలిసేలా చేశారు. 
 
ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత చాలా సంవత్సరాలకు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించి దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన అథ్లెట్ మీరాబాయి చాను వంట గదిలో కింద కూర్చుని భోజనం చేస్తున్న ఫోటోను నటుడు ఆర్ మాధవన్ రీట్వీట్ చేశారు. 
 
దీనిపై స్పందించిన మాధవన్ ''హే ఇది నిజం కాదు. నేను పూర్తిగా పదాలు కోల్పోయాను.'' అని రాసుకొచ్చారు. అయితే, రెండేళ్ల తర్వాత మణిపూర్‌లోని తన ఇంట్లో భోజనం చేస్తున్న ఫోటోను మీరాబాయి చాను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 
ప్రస్తుతం అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ఆ పిక్చర్‌ను చూసిన వాళ్లంతా మీరాబాయి తన పేదరికాన్ని సైతం జయించి ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.