బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (12:48 IST)

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు... ఆండ్రాయిడ్ - ఐఫోన్ యూజర్లకు మాత్రమే...

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్‌లో ఇపుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆండ్రాయిండ్, ఐఫోన్ యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు తీసుకొచ్చేందుకు వాట్సాప్ కంపెనీ సిద్ధమైంది. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
 
రీడిజైన్డ్ ఇన్ యాప్ నోటిఫికేషన్స్: పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్ టెక్నాలజీని అప్‌డేట్ చేయడంపై ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో వాట్సాప్‌ను రీడిజైన్ చేయడానికి కంపెనీ నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం యాప్ నోటిఫికేషన్లపై కసరత్తు చేస్తోంది. 
 
వ్యూ వన్స్ ఫీచర్ : వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచర్లలో వ్యూ వన్స్ ఫీచర్ ఒకటి. సాధారణంగా మనం ఎవరికైనా మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ మెస్సేజ్, జీఐఎఫ్ ఇమేజ్ పంపితే అవతలి వ్యక్తులు వాటిని ఓపెన్ చేసి ఎన్నిసార్లయినా చెక్ చేసుకోవచ్చు. 
 
కానీ ఒకవేళ వ్యూ వన్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఉపయోగిస్తే, మీరు పంపించే మెస్సేజ్, వీడియోలు, పొటోలు ఏదైనాగానీ అవతలి వ్యక్తి ఒకసారి చూపి చాట్ నుంచి బయటకు వస్తే చాలు ఆ సమాచారం మాయమైపోతుంది. అయితే మెస్సేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి టెక్ట్స్, ఫొటో, జీఐఎఫ్ మెస్సెజ్‌లను స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కల్పించింది. 
 
వాట్సాప్ వాయిస్ వేవ్‌ఫామ్స్ : వాట్సాప్ సంస్థ తీసుకురాబోతున్న మరో సరికొత్త ఫీచర్ వాయివ్ వేవ్‌ఫామ్స్. వాయిస్ మెస్సేజ్‌లు వింటున్న సమయంలో వాయివ్ అనేది వేవ్‌ఫామ్ రూపంలో కనిపిస్తుంది. వాట్సాప్ బీటా ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు రెడీ అయింది. ఐఓఎస్ యూజర్లకు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు సమాచారం.