సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (15:53 IST)

లాక్‌డౌన్.. ఇంట్లో వుంటూ మనోళ్లు ఆ పని చేస్తున్నారు.. తెలుసా?

కలియుగం ప్రళయాలకు అడ్డాగా మారిపోతోంది. కలి ప్రభావంతో మానవుల బుద్ధి మందగిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. నేరాలు, వికృత చర్యలే కలియుగ ప్రభావమని వారు అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు అట్టుడికిపోతోంది. ఇది కూడా కలియుగ ప్రభావమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించింది.
 
ఇంట్లోకెళ్లి బయటకు వెళ్తే.. పలుచోట్ల పోలీసులు కుమ్మేస్తున్నారు. దీంతో మెజార్టీ ప్రజలు ఇళ్లలోనే గడిపేస్తున్నారు. కానీ ఇంట్లో వున్న ప్రబుద్ధులు కంప్యూటర్ల ముందు కూర్చుని పోర్న్ సైట్లు చూస్తూ రెచ్చిపోతున్నారు. గత నాలుగైదు రోజులుగా ఈ తంతు జరుగుతుందని.. ఎక్కువ మంది పోర్న్ వీడియోలనే వీక్షిస్తున్నట్లు ఓ సంస్థ ప్రకటించింది. 
 
గత ఫిబ్రవరి నెలలో పోర్న్‌ సైట్ల డైలీ ట్రాఫిక్‌తో పోల్చితే.. ఇప్పుడు మార్చిలో 20శాతంకు పైగా పెరిగిందట. ముఖ్యంగా గత వారం నుంచి మరీ ఎక్కువగా ట్రాఫిక్ పెరిగినట్లు సదరు సంస్థ వెల్లడించింది. ఇండియాలో దాదాపు 857 పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.