సంబంధిత వార్తలు
- సర్కారీ స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పిన లక్ష్మీ మంచు
- తొమ్మిదవ తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి అత్యాచారం
- ఆ వ్యక్తి నెల జీతం ఏడు వేలే.. టాక్స్ మాత్రం రూ.134 కోట్లు కట్టాలట..!
- దీపికా పదుకొనే ఛపాక్ చిత్రానికి వినోదపు పన్ను మినహాయిపు
- చేతబడులకు ఉపయోగించే పాము అక్కడ దొరికింది.. ధర రూ.1.25 కోట్లు
ఎనిమిదో తరగతి విద్యార్థితో జంప్ అయిన 26 ఏళ్ల టీచర్
ఉపాధ్యాయ వృత్తికి ఓ ఉపాధ్యాయురాలు కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. బుద్ధిగా పాఠాలు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయురాలు.. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థితో ప్రేమలో పడింది. ఇంకా స్కూలు నుంచి అతనితో పారిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్కూలుకెళ్లిన తన కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన తండ్రి అసలు విషయం తెలిసి షాకయ్యాడు.
ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాలలో తన కుమారుడికి పాఠాలు చెప్పకుండా మాయమాటలు చెప్పి.. కుమారుడిని వలలో వేసుకుందని.. విద్యార్థి తండ్రి ఆరోపించాడు. ఏడాదిగా ఈ తతంగం నడుస్తున్నా తను గుర్తించలేకపోయానని వాపోయాడు. వారిద్దరినీ పట్టుకుని తన కుమారుడిని తనకు అప్పగించాల్సిందిగా కోరాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కాగా టీచర్‌కు 26 సంవత్సరాలని.. ఏడాది పాటు ఎనిమిదో తరగతి కుర్రాడితో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
