శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (15:48 IST)

ఆ వ్యక్తి నెల జీతం ఏడు వేలే.. టాక్స్ మాత్రం రూ.134 కోట్లు కట్టాలట..!

అవును.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు వచ్చిన ఆదాయ పన్ను నోటీసును చూసి షాకయ్యాడు. టెలికాలర్‌గా పనిచేస్తున్న తనకు నెలకు వేతనం ఏడు వేల రూపాయలు మాత్రమే వస్తుందని.. కానీ ఆదాయ పన్ను రూ.134 కోట్లకు చెల్లించాలని నోటీసు రావడం చూసి అవాక్కైనట్లు తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, బిహింద్ జిల్లాకు చెందిన రవి గుప్తా అకౌంట్ ఎలా ఓపెన్‌ అయిందో తెలియదని.. కానీ ఇది మనీలాండరింగ్ కేసుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. 
 
2011-12 ఏడాది.. ఏడు వేల నుంచి 12వేల రూపాయలు సంపాదించిన రవి గుప్తా అకౌంట్లో కోట్లాది రూపాయల లావాదేవీల వివరించాలవి ఆ నోటీసులో పేర్కొనబడింది. ఇందుకు వివరణ ఇవ్వాలని ఆదాయ పన్ను శాఖ డిమాండ్ చేసింది. గుప్తా పాన్ నెంబర్‌తో తెరిచిన వ్యాపార ఖాతాలో కోట్లాది రూపాయల లావాదేవీల గురించి వివరణ ఇవ్వాలని ఐటీ శాఖ నోటీసులు హెచ్చరించింది. 
 
కాగా ఇందుకు గుప్తా వివరణ ఇస్తూ.. సంస్థపై పరారీలో ఉన్న ఆభరణాల వ్యాపారులు మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీలకు సంబంధం ఉందని గుప్తా తెలిపారు. గుజరాత్‌కు చెందిన డైమండ్ ట్రేడింగ్ సంస్థ ఈ లావాదేవీలు చేసిందని ఆయన పేర్కొన్నారు. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) రూ .14 వేల కోట్ల మోసంలో మోడీ, చోక్సీల పేరు ఉంది. 
 
ఇంకా ఈ లావాదేవీలు జరిగినప్పుడు తనకు 21 ఏళ్లు. 2011 లేదా 12లో ముంబైకి కానీ గుజరాత్‌కు కానీ వెళ్లలేదని వివరణ ఇచ్చాడు. అప్పుడు ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నానని, జీతం ఏడువేల రూపాయలు మాత్రమేనని తెలిపాడు. ఈ ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని గుప్తా చెప్పాడు. 
 
డబ్బును తిరిగి పొందడానికి తన ఆస్తులను అటాచ్ చేస్తానని ఐటి విభాగం బెదిరించిందని, ఈ కేసును పరిష్కరించడంలో సహాయపడటానికి మధ్యప్రదేశ్ సైబర్ సెల్, మహారాష్ట్ర పోలీసులు, ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ), ఐటీ అధికారులకు లేఖ రాశానని గుప్తా మీడియాతో అన్నాడు.