శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 16 జనవరి 2020 (20:54 IST)

వీడియో గేమ్ ఆడదామని బాలుడిని గదిలోకి తీసుకెళ్ళిన ఆంటీ.. ఆ తరువాత?

రోజు రోజుకు నేరాల స్థాయి భారీగా పెరిగిపోతున్నాయి. ఓ పక్క అమ్మాయిలకే రక్షణ లేదనుకుంటే.. మరోపక్క కుర్రాళ్లకు కూడా రక్షణ లేకుండా పోతుంది. వీడియో గేమ్స్ ఆడుకుందామంటూ ఆన్‌లైన్‌కు రమ్మంది.. గేమ్ అనగానే గంతులేసిన ఆ పద్నాలుగేళ్ళ బాలుడు  ఆమెతో కలిసి ఆడటం మొదలుపెట్టాడు.. ఇద్దరు రోజూ గంటల తరబడి వీడియో గేమ్స్‌లోనే గడిపేవారు. మెల్లిగా చాటింగ్ చేయడం మొదలుపెట్టిందామె. అలా అతన్ని మెల్లగా ముగ్గులోకి దింపింది. 
 
బాలుడి ఫోటోలు, వీడియోలు పంపాలని కోరింది. అందుకు సరేనన్న బాలుడు ఆమెకు పంపించాడు. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. ఇదే అదనుగా భావించిన ఆ మహిళ అతడితో శృంగారం చేయాలని భావించింది. ఎక్స్‌బాక్స్ ఆన్‌లైన్‌లో అతడి నగ్న చిత్రాలను షేర్ చేయాలని కోరింది. తన నగ్న ఫోటోలు కూడా పంపింది. అయితే కుమారుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాలుడి తండ్రి ఆరా తీయగా వాస్తవం తెలిసింది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
మైనర్ అయిన తన కుమారుడిని శృంగారంలోకి దింపాలని యత్నించిందని కేసు పెట్టాడు. పోలీసులు మహిళను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన జడ్జి బాలుడిని లొంగదీసుకోవాలని మహిళ యత్నించినట్లు గుర్తించారు. ఆమె పంపిన మెసేజ్‌లు, ఈమెయిల్స్, నగ్న చిత్రాలను పరిశీలించి.. మైనర్‌ను లైంగిక వేధింపులకు గురి చేసిందన్న కారణంతో ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు.