మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 16 జనవరి 2020 (20:45 IST)

ఆ హోంగార్డును అనుభవించా, నువ్వు కూడా రా అంటూ మహిళా ఎస్ఐకి వేధింపులు?

ప్రజలకు రక్షణ కల్పించే మహిళా పోలీసుపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో కామాంధుడు. మహిళా ఎస్ఐకి ఫోన్ చేసిన ఆకతాయి  రాత్రికి లాడ్జికి వస్తావా రాత్రికి నీ రేటు ఎంత? ఒక్కసారి ఎంజాయ్ చేయ్.. నేనెంత మగాడినో నువ్వే చూస్తావు అంటూ వేధించాడు. అంతేకాకుండా తను ఓ మహిళా హోంగార్డుతో ఎంజాయ్ చేశాననీ, తన గురించి ఆమెని అడుగు అంటూ ఆమెతో తీసుకున్న నగ్నఫోటోలను వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో కలకలం రేపుతోంది. 
 
బెంగళూరు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ రెండ్రోజుల క్రితం డ్యూటీ ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో ఇంటికొచ్చింది. అదే సమయంలో ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది ఎత్తగానే అవతలి వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడు. లాడ్జికి వచ్చి తనకు సుఖాన్నిస్తే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానంటూ అసభ్య వ్యాఖ్యలు చేశాడు. వెంటనే తేరుకున్న ఆమె.. రేయ్ నేను ఎవరో తెలుసా? ఎవరికి ఫోన్ చేసి ఏమి మాట్లాడుతున్నావ్?, అసలు నా ఫోన్ నెంబర్ నీకు ఎవరు ఇచ్చారు ? అంటూ ఘాటుగా ప్రశ్నించింది.
 
నువ్వు లేడీ ఎస్‌ఐవి అని తెలిసే ఫోన్ చేశా. నీ స్టేషన్‌లో పనిచేసే మహిళా హోంగార్డే నీ నంబర్ ఇచ్చింది. మహిళా హోంగార్డును నేను అనుభవించా. ఆ సమయంలో ఆమెతో తీసుకున్న న్యూడ్ ఫోటోలు పంపిస్తా చూడు.. అంటూ కాల్ కట్ చేశాడు. ఆ వెంటనే మహిళా హోంగార్డు నగ్న చిత్రాలు ఆమె వాట్సాప్‌కు పంపించాడు. వాటిని చూసిన షాక్‌లో ఆమె ఉండగానే.. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పెట్టి పోలీసుల పరువు తీస్తాను, అలా చేయకూడదంటే నాకు రూ.లక్ష కావాలి అంటూ డిమాండ్ చేశాడు.
 
అతడి వేధింపులు భరించలేకపోయిన మహిళా ఎస్ఐ వెంటనే విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు ఆ కామాంధుడు తనకు పంపించిన న్యూడ్ ఫోటోలు, వీడియోలు వారికి అందజేసింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడి వలలో చిక్కుకున్న మహిళా హోంగార్డులను గోప్యంగా విచారిస్తున్నారు. పోలీసు శాఖలోనే మహిళలనే టార్గెట్ చేసి ఇంతటి నీచానికి పాల్పడి వాడిని వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు.