ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (10:59 IST)

పనిచేసే చోట వేధింపులా? మౌనం వద్దు.. మహిళలకు సన్నీ సూచన

పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ గూగుల్‌లో రాణి లాంటిది. సోషల్ మీడియాలో ఆమెకు అంత ఫాలోయింగ్ వుంది. ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా సినిమాలు చేసుకుంటూ పోతున్న సన్నీలియోన్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. మహిళలను ఉద్దేశించి ఈ వీడియోను ఆమె పోస్టు చేశారు. పని ప్రదేశాల్లో వేధింపులను సహించకండి అంటూ వీడియోను పోస్ట్ చేసింది సన్నీలియోన్. 
 
పనివేళల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తెలియచేసేలా ఉన్న ఆ వీడియోలో సన్నీలియోన్ ఓ కంపెనీలో పనిచేసే ఆఫీసర్‌లా, మహిళలకు తోడ్పాటు అందించే పాత్రలో అదరగొట్టారు. సన్ని ఆ వీడియోను షేర్‌ చేస్తూ.. పని చేసేచోట వేధింపులను తట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి వాటిపై మౌనంగా ఉండకండి. మాట్లాడండి’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సన్నీలియోన్ ప్రస్తుతం కోకో కోలా అనే హారర్ర కామెడీలో నటిస్తోంది. దాంతో పాటు రంగీలా, వీరమదేవి అనే దక్షిణాది సినిమాల్లో నటిస్తోంది.