బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (11:11 IST)

ఆ పని చేయాలంటూ.. నా భార్యకు 3వేల ఫోన్ కాల్స్..

మహిళలపై అకృత్యాల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఓ వైపు అఘాయిత్యాలు, దాడులు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు వేధింపుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా వ్యభిచారం చేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఓ మహిళకు మూడువేల ఫోన్స్ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు వ్యభిచారం చేయాలంటూ తన భార్యకు 3 వేల ఫోన్ కాల్స్ వచ్చాయంటూ ఓ భర్త హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 15న రెండు వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్ చేసిన మహిళలు వ్యభిచారం చేయాల్సిందిగా తన భార్యపై ఒత్తిడి తీసుకొచ్చారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలి తెలిపాడు. వాట్సాప్‌లో అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా  మియాపూర్ ప్రాంతంలో ఇటువంటి బాధితులు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.