శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2019 (14:16 IST)

చిన్న పిల్లవాడిని వైర్లతో కట్టివేసి చితకబాదారు... ఎక్కడ?

చిన్న పిల్లలు ఆడుకుంటూ గొడవ పడిన సంఘటనలో ఒక పిల్లవాడిని వైర్లతో కట్టేసి కొట్టిన దారుణంగా సంఘటన ఓజిలిలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలోని ఓజిలి అరుంధతీవాడకు చెందిన యోగి అనే పిల్లవాడు తోటి పిల్లలతో ఆడుకుంటూ గొడవ పడ్డాడు. దీంతో ఒకర్నొకరు కొట్టుకున్నారు. గొడవ పడిన పిల్లలు వాళ్ల తల్లిదండ్రులకు చెప్పడంతో యోగిని వైర్లతో కట్టివేసి ఇంట్లో నిర్బంధించి చితక్కొట్టారు. 
 
ఈ విషయం తెలుసుకున్న యోగి తల్లిదండ్రులు వైర్లతో కట్టేసి కొట్టేసిన మహిళను నిలదీస్తే వారిని అసభ్యంగా చిట్టి పంపినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఓజిలి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు యోగి తల్లిదండ్రులు తెలిపారు. చిన్నపిల్లలు గొడవపడి కలిసి పోవడం సహజమే అయినప్పటికీ చిన్న పిల్లోడిని కనికరం లేకుండా వైరుతో కట్టి కొట్టడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.