చెరకు తోటలో 17వ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. చివరికి?
కర్ణాటకలో ఓ మహిళ చెరకు తోటలో 17వ బిడ్డకు ప్రసవించింది. కర్ణాటకలో మహిళలు చాలామటుకు చెరుకు పనుల కోసం వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని చెరకు పనులకు… నిండు గర్భిణి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఆమె చెరుకు పొలంలో పనులు చేస్తూ, తన 17 వ బిడ్డకు జన్మనిచ్చింది.
సంచార గోపాల్ వర్గానికి చెందిన ఈ మహిళ సెప్టెంబరులో 20 వ సారి గర్భవతి అని వైద్యులు గుర్తించారు. ఆమెకు 11 మంది పిల్లలు, వారిలో తొమ్మిది మంది బాలికలు ఉన్నారు. ఆమెకు మూడుసార్లు అబార్షన్ కాగా, ఐదుగురు పిల్లలు చనిపోయారని మీడియాకు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమెను కలవడానికి కొందరు అధికారులు వెళ్ళారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి తమ ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు గుర్తించారు. కానీ 17వ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె వెంటనే ప్రాణాలు కోల్పోయింది.