సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జనవరి 2020 (18:38 IST)

నువ్వు గుండెల్లో వున్నావురా.. వెనుక నుంచి గట్టిగా పట్టుకోవాలని అనుకున్నా.. పృథ్వీ సరస సంభాషణ

ఇటీవల అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చిన వైకాపా నేత, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్ పృథ్వీ ఓ మహిళా ఉద్యోగినితో సాగించిన సరససంభాషణ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ఇపుడు తీవ్ర కలకలం రేపుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళా ఉద్యోగికి ఆయన ఫోన్ చేసి సాగించిన సరసన సంభాషణలకు సంబంధించిన సంభాషణ ఆడియో ఇపుడు వెలుగులోకి వచ్చింది. ఇది కలకలం రేపుతోంది. 
 
మహిళా ఉద్యోగినికి ఫోన్ చేసిన పృథ్వీ, అసభ్యంగా మాట్లాడారు. తాను డ్రింక్ చేయడం లేదని, మరోసారి చేయడం మొదలు పెడితే, నీ దగ్గరే కూర్చుని తాగుతానని, కంపెనీ ఇవ్వాలని అడిగారు. 
 
పడుకునేటపుడు, అన్నం తినేటప్పుడు తాను గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. నువ్వంటే నాకిష్టమన్నారు. నువ్వు నా గుండెల్లో ఉన్నావని, నువ్వంటే ఇష్టమని, లవ్ యు రా అంటూ చెప్పుకొచ్చారు. ఇక పృథ్వీ మాటలకు ఆ ఉద్యోగిని కూడా అలాగే స్పందించింది. 
 
నిత్యమూ గుర్తుకు వస్తారని, మీ కోసం వెయిట్ చేశానని చెప్పింది. కిలకిలా నవ్వుతూ మాట్లాడింది. తాను వర్షంలో తడుస్తూ ఇంటికి వచ్చానని, తనను వెనుకనుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నా అరవబోనని మాట్లాడింది. ఈ లీకైన ఆడియోను తెలుగు మీడియా చానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.