శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 19 జనవరి 2020 (17:18 IST)

సర్కారీ స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పిన లక్ష్మీ మంచు

ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల భాష విద్యలో శిక్షణ అందించడంతో పాటుగా నాయకత్వ నైపుణ్యం, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ. ఒక రోజు పాటు ఆంగ్ల భాషా ఉపాధ్యాయురాలిగా సేవ అందించాలని మంచు లక్ష్మిని ఆహ్వానించింది. 
 
ఆ సంస్థ ఆహ్వానం మేరకు మంచు లక్ష్మి ఆదివారం మాదాపూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషను బోధించారు. ఈ టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థకు గౌరవ ఛైర్మన్‌గా కూడా మంచు లక్ష్మి వ్యవహరిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల నడుమ అక్షరాస్యత నైపుణ్యం అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. 
 
ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అక్షరాస్యతను మెరుగుపరిచేందుకు దేశవ్వాప్తంగా టీచ్ ఫర్ ఛేంజ్ పాడు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యం చేసుకుని పనిచేస్తున్న ఈ కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో అక్షరాస్యతను వృద్ధి చేస్తుంది.