శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (13:15 IST)

ఓయూలో టెన్షన్.. ప్రొఫెసర్‌కు మావోలతో లింకుందా?

ఓయూ క్యాంపస్‌ ఆవరణలోని క్వార్టర్స్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కాశీం ఇంట్లో సోదాలు చేపట్టారు పోలీసులు. ఇంకా మావోలతో కాశీంకు సంబంధాలున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. 2016లో నమోదైన కేసులో భాగంగా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
 
సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో ఏ-2 గా ఉన్నారు కాశీం.. ఇదే కేసులో గతంలో మావోయిస్టు పుస్తకాలు, సాహిత్యాలు, స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే కేసులో మరోసారి సెర్చ్ వారెంట్‌తో కాశీం ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ మధ్యే విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు డాక్టర్ కాశీం.. ఓయూలో ఆయన నివాసం ఉంటున్న ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు లోపలికి వెళ్లినట్టు ఆరోపిస్తున్నారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో సోదాలు కొనసాగిస్తున్నాయి.