చేతబడులకు ఉపయోగించే పాము అక్కడ దొరికింది.. ధర రూ.1.25 కోట్లు
ఆ పాముకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ వుంది. ఆ అరుదైన పాము ఐదుగురి చేతికి చిక్కింది. దాని విలువ తెలుసుకుని అమ్మాలనుకున్నారు. కానీ పోలీసులకు చిక్కారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ పాము పేరు రెడ్ శాండ్ బోవ స్నేక్. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పాము ధర 1.25 కోట్లు. అయితే ఈ అరుదైన పామును పట్టుకున్న ఐదుగురు వ్యక్తులు నర్సింఘర్ ప్రాంతంలో అరుదైన ప్రాణమును విక్రయించేందుకు ప్రయత్నించారు.
కానీ పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ పామును పట్టుకుని విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అత్యంత విలువైన అరుదైన జాతికి చెందిన రెడ్ సాండ్ బోవా స్నేక్ విషపూరితమైన పాము కాదని పోలీసులు తెలిపారు.
ఈ పామును మందులు కాస్మెటిక్స్ తయారీలో వాడుతూ ఉంటారని చెప్తున్నారు. ఇంకా చేతబడులు చేసేందుకు కూడా ఈ పామును ఉపయోగిస్తారని పోలీసులు చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పామును కలిగివున్న వారికి అదృష్టం ఖాయమని విశ్వాసం.
అయితే స్థానిక బస్టాండ్ ప్రాంతంలో పాము విక్రయంపై ఫోన్ మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న పోలీస్ ఇన్ ఫార్మర్ విని సమాచారం ఇచ్చారని.. దీంతో వెంటనే అలర్ట్ అయ్యి దాడి జరిపి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.