1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Madurai influencer asks for sweets, gets TVs, fridges on COD

స్వీట్ బాక్స్ అడిగితే రూ.70 కోట్ల ఆర్డర్.. యుద్ధ ట్యాంక్ కూడా : ఇల్లు ఖాళీ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ (Video)

veeramani
తమిళనాడుకు చెందిన ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ వీరమణికి ఓ వింత అనుభవం ఎదురైంది. స్వీట్ బాక్స్ అడిగితే రూ.70 కోట్లకు ఆర్డర్ పెట్టారు. ఇందులో రక్షణ శాఖకు చెందిన ఓ యుద్ధ ట్యాంకర్ కూడా ఉండటం గమనార్హం. ఇవన్నీ క్యాష్ ఆన్ డెలవరీ ఆప్షన్ పెట్టడంతో ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ కోసం డెలివరీ బాయ్స్ వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీంతో వీరి బాధ నుంచి తట్టుకోలేక చివరకు ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వింత అనుభవం తమిళనాడులోని మదురైకి చెందిన వీరమణి అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఎదురైంది. దీపావళి సందర్భంగా.. తనకు ఎవరైనా ఒక స్వీట్ బాక్స్ పంపాలని ఇన్‌స్టాలో వీరమణి వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తన ఇంటి అడ్రస్‌తో పాటు వ్యక్తిగత ఫోన్ నంబర్ కూడా షేర్ చేశారు. 
 
దీంతో మొదట్లో కొందరు స్వీట్లు పంచినా.. ఆ తర్వాత Cash On Delivery (సీఓడీ) పద్ధతిలో రకరకాల వస్తువులు ఆర్డర్లు ఇవ్వసాగారు. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్‌ఫోన్లతో పాటు రూ.1.69 లక్షల విలువైన టీవీ ఆర్డర్ పెట్టి ఆశ్చర్యపరిచారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఏకంగా సీవోడీ పద్ధతిలో రూ.70 కోట్ల విలువైన మిలిటరీ ట్యాంక్‌ను ఆర్డర్ చేయడంతో వీరమణి షాక్ తిన్నాడు. 
 
దయచేసి తన అడ్రస్‌పై ఆర్డర్లు పంపొద్దని వేడుకున్నా.. అతని ఇంటికి ఆర్డర్లు రావడం మాత్రం ఆగలేదు. ఈ బాధను భరించలేక.. తన ప్రస్తుత ఇంటిని ఖాళీ చేసి, మరో చోటికి వెళ్లాల్సిన పరిస్థితి వీరమణికి ఏర్పడింది. దీనిపై వీరమణి తన గోడు వెళ్లబోసుకుంటూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
టీడీపీలో చేరిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను