1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Petrol reaches Rs 100 per litre

సెంచరీ కొట్టిన పెట్రోల్‌!

petrol prices
దేశ చరిత్రలోనే పెట్రోల్‌ ధర తొలిసారి సెంచరీ కొట్టింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ ధర రికార్డు స్థాయిలో రూ.101.15కు పెరిగింది. దేశంలో కొద్ది రోజులుగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు  25 పైసల చొప్పున పెరిగాయి. దీంతో రాజస్థాన్‌లో లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.101.15కు, సాధారణ పెట్రోల్‌ ధర రూ.98.40కు పెరిగింది. తాజా ధరల పెంపుతో ఢిల్లీలో సాధారణ పెట్రోల్‌ రేటు రూ. 86.30కు, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 76.23కు పెరిగింది.
తర్వాతి కథనం
భర్త గల్ఫ్‌లో భార్యకు విడాకులు.. వదినను వదిలించుకోలేని మరిది.. చివరికి?