దేశానికి క్షమాపణలు, పార్లమెంట్ పాదయాత్ర వాయిదా, కానీ...: ఢిల్లీలో రైతుసంఘం నేత యోగేంద్ర
ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ హింస తరువాత ఈరోజు సాయంత్రం వరకూ జరిగిన యునైటెడ్ కిసాన్ మోర్చా సమావేశం తరువాత, రైతు నాయకులు, విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎర్రకోటలో జరిగిన సంఘటనను ఖండించారు. జరిగిన దానికి దేశానికి క్షమాపణలు చెప్పారు.
ఇకపోతే ఫిబ్రవరి 1న రైతుల పార్లమెంట్ పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దానికంటే ముందు మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా జనవరి 30న ఒక రోజు ఉపవాసం పాటించనున్నట్లు తెలిపారు. కిసాన్ రిపబ్లిక్ పరేడ్ సందర్భంగా ఎర్రకోట వద్ద త్రివర్ణాన్ని అవమానించిన సంఘటన దేశం మొత్తం మనోభావాలను దెబ్బతీసిందని యునైటెడ్ కిసాన్ మోర్చా నాయకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. అందువల్ల, దేశం మొత్తానికి సందేశం ఇవ్వడానికి త్రివర్ణాన్ని అవమానించినట్లయితే, అది రైతులకు కూడా విచారకరం, కాబట్టి పార్లమెంటు కవాతు ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు మార్చ్ రద్దు చేయబడటం లేదని, వాయిదా మాత్రమే వేస్తున్నట్లు స్పష్టం చేసారు.
స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ... రైతుల ఉద్యమం మొత్తం దేశంలోని రైతులకు చెందినదని, యునైటెడ్ కిసాన్ మోర్చా ఎల్లప్పుడూ దేశం కోసం పనిచేస్తుందని అన్నారు. రైతు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. ఉద్యమం చేసేవారికి ఎఫ్ఐఆర్, జైలు గురించి తెలుసని ఆయన అన్నారు.