1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Stepfather arrested for raping daughter

భార్యతో సంసారం, కుమార్తెపై అత్యాచారం, సవతి తండ్రి దారుణం

Stepfather
ఆమెకి భర్త చనిపోవడంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఐతే పెళ్లి చేసుకున్న సదరు వ్యక్తి, భార్యతో సంసారం చేస్తూనే ఆమె కుమార్తెపై కన్నేసాడు. వరసకు కుమార్తె అయినా వదలని కామాంధుడు ఆమెపై అత్యాచారం చేసాడు. ప్రతిరోజూ ఈ వేధింపు జరుగుతూనే వుంది.
 
వివరాల్లోకి వెళితే.. విజయనగరంలో నివాసముండే మహిళ తన భర్త చనిపోవడంతో కుమార్తెతో నివాసం వుంటోంది. ఆమెకి మరో వ్యక్తి పరిచయం కావడంతో అతడిని వివాహం చేసుకుంది. ఆ వ్యక్తి భార్యతో కాపురం చేస్తూనే ఆమె 12 ఏళ్ల కుమార్తెపై కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని కన్నతల్లికి చెప్పులేకపోయిందా బాలిక.
 
ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిందా మహిళ. అక్కడ పక్కింట్లో వున్న తన పిన్నికి తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి చెప్పింది బాలిక. ఇదిలావుండగానే మహిళ సోదరుడు వారికి సర్దిచెప్పి మళ్లీ అతడి వద్దకు పంపాడు.
 
ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ ఆ కామాంధుడు బాలికపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు. దీనితో తనపై జరుగుతున్న లైంగిక దాడి విషయమై బాలిక తన పిన్నికి ఫిర్యాదు చేసింది. విషయాన్ని బాలిక తల్లికి చెప్పిన బాలిక పిన్ని, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడిపై దిశ చట్టం కేసు కేసు నమోదు చేసారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
గర్భస్థ శిశువును కూడా వదిలిపెట్టని కరోనా మహమ్మారి..